- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Purandeshwari : టీటీడీ నిర్ణయాలు భేష్ : ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి
దిశ, వెబ్ డెస్క్ : హిందూయేతర ఉద్యోగులను బదిలీ చేయడం లేదా వీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం కల్పించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeshwari)హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని బీజేపీ డిమాండ్ చేసి ఉందని, టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హిందూ ధర్మ పరిరక్షణకు మేలు చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తీసుకున్న టీడీడీ నూతన పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడును తాను అభినందిస్తున్నానన్నారు.
అంతకుముందు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ సైతం టీటీడీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా, తిరుమల పవిత్రతను కాపాడేలా నిర్ణయాన్ని తీసుకోవడం అభినందనీయమన్నారు. అన్యమతస్తులను వేరే డిపార్ట్ మెంట్ కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం.. హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేకంటేశ్వరస్వామి వెలసిన పుణ్యభూమి అన్నారు. హిందువులు ఎంతో పరమపవితంగ్రా కొలిచే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలను, ఆ వైభవాన్ని టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులు ముందుకు తీసుకెళ్లలేరన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో, పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారం నిషేధం ఉందన్నారు. అయినప్పటికి గతంలో అనేకసార్లు ఈ పుణ్యక్షేత్రం ఆవరణలో ఇతర మత ప్రచారాలు జరిగిన ఘటనలు అనేకంగా చూశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం టీటీడీ పాలకమండలిలో ఇతర మతస్తులను ఉద్యోగులుగా తీసుకువచ్చి, హిందూ ధర్మాన్ని కించపర్చేలా వ్యవహరించిందని, ఈ చర్యను గతంలో అనేకసార్లు బీజేపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. హిందూ మతాన్ని ‘సెక్యులర్’ పార్టీలు ఒక ఓటు బ్యాంకు రాజకీయంగానే వాడుకోవడం కూడా ఇంతకుముందు చూశామన్నారు. టీడీడీ నూతన పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో వేంకటేశ్వరుని నివాసం ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నామన్నారు.