- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పదవ తరగతిలో 10/10 ర్యాంకు సాధిస్తే పదివేలు బహుమానం
దిశ,మహేశ్వరం: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 10/10 ర్యాంకు సాధిస్తే,10/10 ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికీ పదివేలు రూపాయల బహుమానం ఇస్తానని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. మంగళవారం మహేశ్వరం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ, మన్సాన్ పల్లి గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో ఉన్న డిజిటల్ టీవీలను విద్యార్థుల చేత ఓపెన్ చేయించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఓపీ రిజిస్టర్ సక్రమంగా నిర్వహిస్తున్నారా అని ఆరా తీశారు.ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ప్రజలను వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిసరాలు పరిశుభ్రంగా లేవని, శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. డాక్టర్లు సమయపాలన పాటించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో శైలజా రెడ్డి,ఎంపీవో రవీందర్ రెడ్డి,పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.