Ram-Mahesh Babu: రామ్ పోతినేని ‘RAPO-22’ మూవీకి ముహూర్తం ఫిక్స్

by Hamsa |
Ram-Mahesh Babu: రామ్ పోతినేని ‘RAPO-22’ మూవీకి ముహూర్తం ఫిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), మహేష్ బాబు కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘రాపో 22’(Rapo 22). ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) బ్యానర్‌పై నవీన్ యర్నేనీ(Naveen Yarneni), వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని రామ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, రామ్ పోతినేని ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ‘రాపో 22’ (Rapo 22)సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నవంబర్ 21న నిర్వహించబోతున్నట్లు ప్రకటించాడు. అలాగే ‘‘కొత్త అనుభూతి పొందటానికి సిద్ధంగా ఉండండి. సూపర్‌ టాలెంటెడ్‌ మహేష్ బాబు(Mahesh Babu)తో కలిసి పనిచేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అనే క్యాప్షన్ జత చేశాడు. అంతేకాకుండా ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. ఇందులో రామ్ సైకిల్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు.

Advertisement

Next Story