- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బు కోసం ఢిల్లీని వీడలేదు.. గవాస్కర్‌కు పంత్ కౌంటర్
దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను రిటైన్ చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఫ్రాంచైజీతో విభేదాలే కారణమని, పంత్ ఎక్కువ డబ్బు అడిగాడని పలు వార్తలు వచ్చాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, పంత్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ..రిటెన్షన్ ఫీజు విషయంలో పంత్ ఫ్రాంచైజీతో విభేదించి ఉండొచ్చని చెప్పాడు.
‘కొన్నిసార్లు ఓ ఆటగాడిని ఓ ఫ్రాంచైజీ ఫీజుల ఆధారంగా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి.కొంతమంది ఆటగాళ్లు మొదటి ప్రాధాన్యత రుసుము కంటే ఎక్కువ ఆశిస్తూ వేళానికి వెళ్లొచ్చు.ఢిల్లీ క్యాపిటల్స్ కచ్చితంగా పంత్‌ను తిరిగి సొంతం చేసుకుంటుందని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించాడు. స్టార్ స్పోర్ట్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. పంత్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యాడు. ఢిల్లీ ఫ్రాంచైజీని వీడటానికి డబ్బుతో సంబంధం లేదని గవాస్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు. ‘నా రిటెన్షన్ అంశం డబ్బుతో ముడిపడి లేదని కచ్చితంగా చెప్పగలను’ అని పంత్ ట్వీట్ చేశాడు. కాగా, రూ. 2 కోట్ల కనీస ధరతో పంత్ వేలంలోకి రానున్నాడు. ఆక్షన్‌లో అతనికి భారీ ధర పలికే అవకాశం ఉంది.