- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రైవేటు విద్యాసంస్ధల ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి.. ఎమ్మెల్సీ కొదండ రామ్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ పై చట్టం తేవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ ప్రోఫెసర్ కోదండరామ్ తెలిపారు.శాసన మండలిలో విద్యా వ్యవస్థ చర్చలో బుధవారం మాట్లాడారు. అడ్మిషన్లు లేని ప్రభుత్వ పాఠశాలపై నిర్ణయం తీసుకొవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరి విద్య ప్రవేశ పెడితే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. అడ్మిషన్లను పెంచే పాత్ర పై గ్రామ సర్పంచ్లు సహకారం అందించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు చేయాలన్నారు. విద్యార్థుల డ్రాప్ అవుట్ రేట్ తగ్గించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో డిజీటల్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పిచాలన్నారు. డిగ్రీ విద్య కాళ్లు నరికేసారని హెద్దేవా చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా చేసిన రాజేశ్వరరావుకు మంత్రి పదవి ఇస్తానంటే నాకు పదవి వద్దు నా నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేయండి అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో డిగ్రీ చదివేందుకు యువత ముందుకు రావడం లేదని ఢిల్లీ , బెంగుళూరు నగరాలలో ఆసక్తీ చూపుతున్నారని అన్నారు. విద్యాశాఖ మౌళిక సాదుపాయల కల్పన లో 25వ స్థానంలో ఉన్నామని తెలిపారు. అభ్యసన , బోధన అంశాలలో దేశ వ్యాప్తంగా మనం అట్టడగులన ఉన్నమన్నారు. మన తర్వాత స్థానంలో మెఘాలయా మాత్రమే ఉందని తెలిపారు.