- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Amazon: ఏఐని వాడి 1.5 కోట్ల నకిలీ ఉత్పత్తులను గుర్తించిన అమెజాన్

దిశ, బిజినెస్ బ్యూరో: 2024లో ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా నకిలీ ఉత్పత్తులను గుర్తించినట్టు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ బుధవారం ప్రకటనలో తెలిపింది. ఆయా నకిలీ ఉత్పత్తులను గుర్తించడమే కాకుండా వాటిని సీజ్ చేసి, ధ్వంసం చేసినట్టు కంపెనీ తెలిపింది. అయితే, ఆయా నకిలీ ఉత్పత్తులను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ద్వారా గుర్తించినట్టు వెల్లడించింది. దీనికోసం కంపెనీ బిలియన్ డాలర్ల(రూ. 8,560 కోట్ల)కు పైగా పెట్టుబడులు పెట్టింది. మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, నిపుణుల సాయంతో ఏఐని ఉపయోగించి కస్టమర్లను, ఒరిజినల్ బ్రాండ్లు, విక్రేతలను నకిలీ ఉత్పత్తుల నుంచి రక్షించినట్టు కంపెనీ వివరించింది. ఏఐని వాడటం మూలంగా నకిలీ వస్తువులను గుర్తించడం సులభంగా మారింది. అంతేకాకుండా ఏఐ వల్ల 99 శాతానికి పైగా నకిలీవనే అనుమానం ఉన్న వాటిని గుర్తించి బ్లాక్ చేశామని అమెజాన్ తెలిపింది. నకిలీ ఉత్పత్తులను గుర్తించేందుకు ప్రతిరోజూ ప్రొడక్ట్ లిస్టింగ్ సమయంలో జరిగే మార్పులను ఏఐ గుర్తిస్తుంది. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మకానికి వచ్చే ముందు ఉత్పత్తుల ఫోటోలు, లోగోలను ఏఐ టూల్ క్షుణ్ణంగా స్కాన్ చేస్తుంది. చాలా నకిలీ బ్రాండ్లు అన్నిటినీ దాటుకుని అమ్మకానికి వచ్చేందుకు ప్రయత్నిస్తాయని, వాటిని గుర్తించడానికి అమెజాన్ లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను ఉపయోగిస్తోంది. దీని ద్వారా సూక్ష్మస్థాయిలో నకిలీ ఉత్పత్తుల పేర్లు, ఫోటోలు, లోగోలో మార్పులను పరిశీలిస్తుంది. అంతేకాకండా ఆయా మోసపూరిత బ్రాండ్ల ఐపీ అడ్రస్, బ్యాంకింగ్ సమాచారం, అకౌంట్ యాక్టివిటీ, నేరపూరిత నెట్‌వర్క్ సంబంధిత అంశాలను సమీక్షిస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత నకిలీ ఉత్పత్తులు కస్టమర్ల వరకు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు కంపెనీ పేర్కొంది.