- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rana Daggubati: ‘రానా నాయుడు సీజన్-2’ పై రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati), వెంకటేష్ కాంబోలో వచ్చిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’(Rana Naidu) బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ తెలుగు, తమిళం, హిందీతో పాటు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి విమర్శలు అందుకుంది. ఇందులోని కొన్ని సీన్స్ అసభ్యకరంగా ఉన్నాయంటూ అప్పట్లో కొందరు ట్రోల్స్ కూడా చేశారు. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ‘రానా నాయుడు-2’(Rana Naidu-2) రాబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అంతేకాకుండా గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా(Rana Daggubati) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘మేం నిజానికి ప్రేక్షకులను ముందస్తుగానే సిద్ధం చేశాం. రానానాయుడు షోలను కుటుంబంతో కలిసి చూడొద్దని చెప్పాం. కానీ ఎవరూ మా మాట వినలేదు. రానానాయుడు వేధింపులకు గురయ్యే యువకుల గురించి ఉంటుంది. ఇది బాధాకరమైన స్టోరీ. ఈ విషయాన్ని బలంగా చెప్పినప్పుడు మాత్రమే షోను చూస్తారు. అయితే సీజన్-2(Season-2)తో మేము కొన్ని సరిహద్దులు, కట్టుబాట్లను తొలగించాం. మేము సీజన్ 2 షూటింగ్ పూర్తి చేశాం. ఈ సారి గత ఇన్‌స్టాల్ మెంట్ కంటే కంటెంట్, భాష మెరుగ్గా ఉండబోతుంది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ రానా కామెంట్స్ ‘రానా నాయుడు-2’ పై అంచనాలు పెంచేస్తున్నాయి.