మనోవేదనకు గురైన రైతు..వ్యవసాయ పొలంలో ఆత్మహత్య

by Naveena |
మనోవేదనకు గురైన రైతు..వ్యవసాయ పొలంలో ఆత్మహత్య
X

దిశ, అచ్చంపేట : అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అనంతవరం గ్రామంలో చోటుచేసుకుంది. బాలస్వామి ( 57) తన పొలంలో మొక్కజొన్నసాగు చేస్తున్నాడు. వ్యవసాయ అప్పుల సమస్యలతో నిత్యం ఆవేదన చెందుతూ ఉండేవాడు. అలాగే తన కూతురు వివాహం చేయడంతో..అప్పులు మరింత పెరిగాయి. కుటుంబంలో కాస్త తగువు ఏర్పడిందని,తాను మరింత మనోవేదన చెందాడు. దీంతో తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడికి భార్య వెంకటమ్మ తో పాటు కూతురు ఉన్నారు. ఈ సంఘటనపై బల్మూరు ఎస్సైని వివరణ కోరేందుకు దిశ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement

Next Story