Air pollution: వాహన కాలుష్యానికి చెక్ పెట్టాలా.. ఈ టిప్స్ పాటించండి..?

by Anjali |
Air pollution: వాహన కాలుష్యానికి చెక్ పెట్టాలా.. ఈ టిప్స్ పాటించండి..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ డేస్‌లో భారతదేశం(India) ఎదుర్కొంటోన్న సమస్యల్లో కాలుష్యం(Pollution) ఒకటి. ఎయిర్ పొల్యుషన్(Air pollution) విపరీతంగా పెరిగిపోవడంతో జనాలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్(Oxygen) లభించడం అంటే చాలా కష్టమైపోయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ(Delhi) కాలుష్య కోరల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే పొగలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. కాగా కాలుష్యానికి చెక్ పెట్టాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మీ వాహనాన్ని ఎప్పుడూ ఫిట్‌(Fit)గా ఉంచుకోవాలి. ఎప్పుడు మెయింటనెన్స్ చేయాలి. ఎయిర్ ఫిల్టర్స్‌(Air filters)ను, ఆయిల్ మార్పుల్ని తరచూ పరిశీలిస్తూ ఉండాలి. అవసరమైన వాటిని ఛేంజ్ చేయాలి. దీంతో కాలుష్యానికి కారణం అయ్యే పదార్థాలు వాహనం నుంచి రిలీజ్ కాకుండా ఉంటాయి. అలాగే పీయూసీ సర్టిఫికెట్(PUC Certificate) ఉన్నట్లైతే.. జర్నీ చేస్తున్నప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు. అధిక ఆక్టేన్ లెవల్(Octane level), మెరుగైన లూబ్రిసిటీ(Lubricity) ఉన్న ఇంధనానికి ఎక్కువగానే ఖర్చవుతుంది. కానీ పర్యావరణానికి మేలు జరుగుతుంది. అలాగే మీరు ఒకవేళ కారు నడుపుతున్నట్లైతే.. ఎయిర్ కండీషన్ సిస్టమ్‌ను పొదుపుగా ఉపయోగించాలి. జర్నీలో అవసరానికి మాత్రమే వేసుకుంటే బెటర్.

దీంతో వాహనం నుంచి తక్కువ కాలుష్యం రిలీజ్ అవుతుంది. ఇక చలికాలంలో చాలా మంది ఏసీ(AC)ని వాడదు. హీటర్(Heater) అధికంగా వినియోగిస్తారు. దీంతో అధిక కాలుష్యం రిలీజ్ అవుతుంది. పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) వాహనాలకు ప్రత్యామ్నాయంగా సీఎన్ జీ(CNG)వాహనాలను వాడితే బెటర్. ప్రెజెంట్ డేస్‌లో ఎన్నో సంస్థలు సీఎన్ జీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈ వాహనాలు అయితే కాలుష్యాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు(Electric vehicles) కూడా మరో మంచి ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed