వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు.. కారణం ఇదే

by Rani Yarlagadda |   ( Updated:2024-10-07 15:56:44.0  )
వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు.. కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దయింది. పుంగనూరులో ఇటీవలే దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియా కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 9వ తేదీన జగన్ పుంగనూరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఆయన పర్యటనను తాజాగా రద్దు చేసుకున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. చిన్నారిని హత్యచేసిన నిందితుల్ని ప్రభుత్వం అరెస్ట్ చేసిన నేపథ్యంలో జగన్ పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 29న ప్రైవేటుకు వెళ్లి ఇంటికొచ్చిన అస్పియా (7) కొద్దిసేపటికి కనిపించలేదు. కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మూడ్రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో మృతదేహం లభ్యమైంది. దీంతో తొలుత బాలికపై అత్యాచారం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. చిత్తూరు ఎస్పీ మణికంఠ టీమ్ చేసిన విచారణలో బాలిక హత్యకు నగదు లావాదేవీలే కారణమని తేలింది. బాలికను చంపిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది.

బుర్కా వేసుకుని వచ్చిన ఆ మహిళ.. చాక్లెట్ ఆశ చూపించి బాలికను తన ఇంటికి తీసుకెళ్లి.. నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి హత్యచేసినట్లు ఎస్పీ వివరించారు. చనిపోయాక డెడ్ బాడీని టూవీలర్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed