సీఎం జగన్‌కు భయమేంటో చూపిస్తా: నారా లోకేష్ వార్నింగ్

by Satheesh |   ( Updated:2023-02-17 09:50:18.0  )
సీఎం జగన్‌కు భయమేంటో చూపిస్తా: నారా లోకేష్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టినా పాదయాత్ర శ్రీకాళహస్తికి చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో బహిరంగా సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రసంగించిన లోకేష్ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. యువగళం దెబ్బకు సీఎం జగన్‌కు జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు. శ్రీకాళవాస్తి ఈశ్వరుడిని దర్శించుకునేందుకు కూడా పర్మిషన్ లేదంటున్నారని మండిపడ్డారు. యువగళం యాత్రను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగనిస్తే పాదయాత్ర.. లేదంటే దండయాత్రనే అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాదయాత్రలో అడుగుఅడుగునా ఇబ్బందులు పెడుతోన్న జగన్‌కు భయమేంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఒక బడాచోర్ అని.. అవినీతితో రూ.2 వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: లోకేష్.. నీ DNA ఏంటో చెక్ చేసుకో: కొడాలి నాని ఫైర్

Advertisement

Next Story