అప్పుడు అలా ఎందుకన్నారు.. చంద్రబాబు, పవన్‌పై పేర్ని నాని తీవ్ర విమర్శలు

by srinivas |   ( Updated:2024-03-17 14:54:20.0  )
అప్పుడు అలా ఎందుకన్నారు.. చంద్రబాబు, పవన్‌పై పేర్ని నాని తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: చిలకలూరుపేట ప్రజాగళం సభలో ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. 2019 ఎన్నికల ముందు మోడీని చంద్రబాబు విభేదించిన విషయాలు గుర్తు చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఐదేళ్ల కింద మోడీని చంద్రబాబు ఎందుకు తిట్టారని.. ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకున్నారని నిలదీశారు. చంద్రబాబు కేసులను ఉద్దేశించి పేర్ని నాని వ్యగ్యంగా విమర్శలు చేశారు. ‘నన్ను క్షమించు మోడీ. . జగన్ నుంచి నన్ను కాపాడు మోడీ.. అని చంద్రబాబు వేడుకున్నారు.’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఈ మార్పునకు కారణం ఏంటని ఎద్దేవా చేశారు. అమరావతి స్కామ్‌పై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. చంద్రబాబు భజన మామూలుగా లేదని, అసలు వారి పొత్తులు, ఒప్పందాలు రాష్ట్రానికి అవసరం లేదని కొట్టిపారేశారు. పోలవరాన్ని ఏటీఎమ్ లా వాడుకున్నారని ప్రధాని మోడీనే అన్నారు కదా అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్‌కు ఓటు వేయొద్దని సొంత చెల్లెళ్లే అంటున్నారని చంద్రబాబు చెప్పారని... ఆ నాడు ఎన్టీ రామారావు కూడా ఓటు వేయొద్దని పేర్ని నాని సెటైర్లు వేశారు. ప్రధాని మాట్లాడుతుండగా మైక్ కట్ అయిన విషయంపైనా పేర్ని నాని విమర్శలు కురిపించారు.

ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న పవన్ వ్యాఖ్యలపైనా పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాకినాడలో పాచిపోయిన లడ్డూలు.. చిలకలూరిపేటలో ఎలా తాజాగా మారాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలు కూటమికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని సభలో ఎందుకు చెప్పలేదు. మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా.. లేదా అనేది చెప్పలేదు.’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Read More..

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

Advertisement

Next Story

Most Viewed