- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పవన్ కల్యాణ్ చెబుతున్న 24+3=40 లెక్కేంటో అర్థం కావట్లేదు’
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-జనసేన సీట్ల ప్రకటనపై ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద దుమారాన్నే రేపింది. టికెట్ ఆశించిన రెండు పార్టీల నేతలు ఒక్కొక్కరుగా ఆవేదన వెళ్లగక్కుతున్నారు. మరోవైపు జనసేనకు కేవలం 24 సీట్లే ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేనా పవన్ కల్యాణ్ స్థాయి అంటూ అధికార వైసీపీ నేతలు ప్రశ్నిస్తుండగా.. పదేళ్లుగా ప్రజల సమస్యలపై కొట్లాడుతున్న మనకు ఆఫ్ట్రాల్ 24 సీట్లేనా? అని జనసేన నేతలు కూడా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీట్ల ప్రకటన అనంతరం పవన్ కల్యాణ్ చెబుతున్న 24+3=40 లెక్కేంటో అర్థం కావట్లేదని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా.. దీనిపై గురజాల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ చెబుతున్న 24+3=40 లెక్కేంటో నాక్కూడా అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. కేవలం జగన్ మీద కోపంతోనే పవన్ కల్యాణ్ టీడీపీతో కలిశారని అన్నారు. పొత్తులు ప్రజలకు మంచి చేసేందుకు జరుగాలి కానీ, వ్యక్తి మీద కోపంతో కాదని హితవు పలికారు. అసలు సీట్లపై జరిపిన చర్చల్లో చంద్రబాబు ఏం చెప్పాడో.. పవన్ కల్యాణ్ ఎలా అర్థం చేసుకున్నాడో తెలియట్లేదని సెటైర్లు వేశారు. ముందు 24+3=40 లెక్కేంటో జనసైనికులకు పవన్ కల్యాణ్ అర్థం చేయించాలని హితవు పలికారు.
Read More..