- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో పెట్టుబడులపై వైసీపీ నేతలు గొప్పలు చెప్పారు.. నారా లోకేశ్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీ నడుమ మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పారని, వారు చెప్పినంత ఈజీగా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావన్నారు. గతేడాది గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సందర్భంగా సీఎం జగన్, మంత్రి అమర్ నాథ్ కూడా రూ.13.12 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని చెప్పనట్లుగా పేర్కొన్నారు. వారు ఆ మాట చెప్పి ఏడాది అవుతున్నా.. ఇప్పటికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు.
అందుకు మూల కారణం జే-ట్యాక్స్ అని ఆరోపించారు. ఆ ట్యాక్స్ కట్టలేకనే జాకీ, లులు కంపెనీలు ఆంధ్రా నుంచి పరారయ్యాయని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విముఖత చూపారని ఆరోపించారు. తాజాగా, కాంట్రాక్టర్ వద్ద పని చేసే 11 మందిని నిర్భందించారని, కాంట్రాక్టర్ గొంతుపై కత్తి పెట్టి బెదిరించినంత ఈజీ కాదని మండిపడ్డారు. ఇలాంటి నేతలు ఉన్నచోట పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ధైర్యం చేస్తారని లోకేశ్ అన్నారు.
Read More..
BIG BREAKING : చంద్రబాబు ఇంటికి చేరకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్