AP:వైసీపీ నేతల్లో ఓటమి భయం అందుకే ఓదార్పు యాత్ర..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP:వైసీపీ నేతల్లో ఓటమి భయం అందుకే ఓదార్పు యాత్ర..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనంతరం గెలుపు ఓటములపై చర్చలు మొదలయ్యాయి. ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో ఏపీలో జరిగే తాజా పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓడిపోతున్నామన్న విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అర్థమైందని, అందుకే ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు.

ఓటమి తప్పదన్న విషయాన్ని జగన్ తట్టుకోలేకనే తామే గెలుస్తామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు కుదేలవుతున్నారు అన్నారు. అందుకే జగన్ చిన్నపాటి ఓదార్పు యాత్ర చేపట్టి ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి వచ్చారని ఎద్దెవా చేశారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న జగన్ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని మూసేస్తామని చెప్పగలరా? అని బొండా ఉమ సవాల్ విసిరారు. ఇక, ఏపీలో పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింస పై సిట్ తన నివేదికను డీజీపీకి అందించడంపై ఉమ స్పందించారు. సిట్ అందించిన నివేదికను డీజీపీ బహిర్గతం చేయాలని అన్నారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed