ఆ కర్మ జగన్‌కు పట్టలేదు.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

by srinivas |   ( Updated:2024-06-20 13:01:03.0  )
ఆ కర్మ జగన్‌కు పట్టలేదు.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: రుషికొండ భవనాల్లో ఉండేందుకు గత సీఎం జగన్ ప్యాలెసుల్లా నిర్మించుకున్నారన్న ప్రచారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. రుషికొండ భవనాలు జగన్ కోసం కట్టుకున్నవని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఇళ్లల్లో, గెస్ట్ హౌస్‌ల్లో ఉండాల్సిన కర్మ జగన్‌కు పట్టలేదని నాని తెలిపారు. విశాఖలో సొంత ఇల్లు కట్టుకుని జగన్ అక్కడికి వెళ్లిపోతారని స్పష్టం చేశారు. జగన్ క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌పైనా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాటి విలువ ఎంత ఉంటుందో చెబితే కట్టేస్తామని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తామని, ఆ తర్వాత ప్రశ్నిస్తామని చెప్పారు. ఎన్డీయే కూటమి నాయకులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తమ కార్యకర్తలపై దాడులు చేశారని, బాధితులకు అండగా ఉంటామని కొడాలి నాని పేర్కొన్నారు.

Advertisement

Next Story