Breaking: జగన్‌కు బిగ్ షాక్.. లండన్ ప్రయాణానికి కోర్ట్ బ్రేక్

by srinivas |
Breaking: జగన్‌కు బిగ్ షాక్.. లండన్ ప్రయాణానికి కోర్ట్ బ్రేక్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఈ పర్యటన వాయిదా పడింది. సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్పోర్ట్ రద్దు అయింది. దీంతో జనరల్ పాస్ పోర్టు కోసం ఆయన దరఖాస్తు చేశారు. అయితే ఐదు సంవత్సరాలు పాటు పాస్ పోర్టు అనుమతి ఇవ్వాలని కోరుతూ విజయవాడ కోర్టులో ఆయన తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఒక ఏడాది పాటు మాత్రమే జగన్‌కు పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed