- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Elections2024: టీడీపీకి బిగ్ షాక్.. రెబెల్ అభ్యర్థిగా కీలక నేత..
దిశ,తుని: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తుని నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీకి యనమల కృష్ణుడుకు సిద్ధమైయ్యారు. అయితే టీడీపీ అధిష్టానం టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు పార్టీ టికెట్ ఇచ్చింది. దీనితో అసంతృప్తికి యనమల కృష్ణుడు గురయ్యారు. అయితే ఇప్పటికే ప్రస్తుత ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేతిలో వరుసగా రెండుసార్లు ఓటమి పాలైన యనమల కృష్ణుడు ఈసారి ఎలాగైనా పోటీ చేసి గెలవాలని భావించారు.
అయితే ఊహించని రీతిలో తన అన్న అన్న రామకృష్ణుడు తన కుమార్తె దివ్యకు తుని టికెట్ ఇప్పించుకున్నారు. దీనితో కృష్ణుడు అసంతృప్తికి గురైయ్యారు. ఈ నేపథ్యంలో అన్న యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె దివ్య తన వర్గాన్ని దూరం పెడుతున్నారని కృష్ణుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అన్న యనమల రామకృష్ణుడు తనను పిలిచి మాట్లాడక పోవడం, తనను ఖాతరు చేయకపోవటంతో తుని కూటమి అభ్యర్థి యనమల దివ్యకు సహకరించకుండా కృష్ణుడు స్థబ్ధుగా ఉండిపోయారు.
ఇక తనని కాదన్న టీడీపీకి బైబై చెప్పి వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో యనమల కృష్ణుడు రాకపై మంత్రి దాడిశెట్టి రాజాతో సీఎం జగన్ ఇప్పటికే చర్చించగా ఎటువంటి షరతులు లేకుండా వైసీపీలోకి రావాలని అధిష్టానం తెలిపిందని సమాచారం. అయితే 2014, 2019 ఎన్నికల్లో దాడిశెట్టి రాజా చేతిలో యనమల కష్ణుడు ఓటమిపాలైనప్పటికీ, యాదవ సామాజిక వర్గంలో కృష్ణుడుకి మంచి పట్టు ఉందనే విషయాన్ని దాడిశెట్టి రాజా జగన్ దృష్టికి తీసుకువచ్చారు.
వైసీపీ లోకి వస్తే ప్రత్తిపాడు సీటును కేటాయించాలని యనమల కృష్ణుడు డిమాండ్ చేయటంతో వైసీపీ అధిష్టానం కృష్ణుడు చేరిక అంశాన్ని పక్కన పెట్టేసినట్లు సమాచారం. కాగా ఈ నెల 25న కార్యకర్తలతో కృష్ణుడు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలను పరిగణనలోకి తీసుకుని కీలక నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.
వారి సూచనల ప్రకారం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే కృష్ణుడు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే కూటమికే ఎక్కువ నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కృష్ణుడుని టీడీపీ అధిష్టానంలో పిలిపించుకుని సర్ది చెబుతుందా లేక రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంచుతారా అనేది వేచి చూడాలి.