Minister Savita:బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పై వర్క్ షాప్

by Jakkula Mamatha |
Minister Savita:బీసీ  సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పై వర్క్ షాప్
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత(Minister Savita) అన్నారు. ఈ రోజు(గురువారం) అమరావతిలో బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాల(Central Govt Schemes) అమలుపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో సీడ్ పథకం అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 6 జిల్లాలో సీడ్ పథకం అమలు చేస్తున్నాం అని తెలిపారు. త్వరలో మిగిలిన 20 జిల్లాల్లో కూడా అమలు చేస్తామని మంత్రి చెప్పారు.

ఈ పథకం కింద BC-Aలో ఉన్న సంచార జాతుల జీవన ప్రమాణాలు(Living standards of nomads) పెంచేలా నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అంతేకాదు 100 బీసీ హస్టళ్లలో(BC Hostles) ఎస్‌ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ల(Sankaran Resource Centers) ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో మంత్రి సవిత జిల్లా అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. బీసీ హాస్టళ్లను తరుచూ తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీసీ స్టడీ సర్కిల్(BC Study Circles) ద్వారా అన్ని కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ (Coaching for competitive exams) ఇస్తామని తెలిపారు. బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు(CC cameras) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే బీసీ కులాల వృత్తుల్లో(occupations of BC castes) నైపుణ్యం పెంచి జీవనోపాధి(Livelihood) పెంపొందించేలా వారికి ఆర్థిక చేయూత అందిస్తామన్నారు.

Next Story