అంగన్వాడీలకు సర్కార్ భారీ షాక్.. వేతనాల పెంపుపై క్లారిటీ

by Anjali |
అంగన్వాడీలకు సర్కార్ భారీ షాక్.. వేతనాల పెంపుపై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం కంటే కనీసం వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తామని చెప్పిన సీఎం జగన్.. హామీ ఇంకా నెరవేర్చలేదని అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు ఏపీలో సమ్మె చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అయినా కూడా గత నాలుగేళ్లుగా జీతాలు పెంచలేదని, రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చినట్లు డీఏ కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు తెగేసి చెబుతున్నారు.

దీనిపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ స్పందించింది. ‘‘అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. సమ్మె విరమించి విధులకు హాజరు కావాలి. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచాం. అలాగే రిటైర్‌మెంట్ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. గతంలో తెలంగాణకు సమానంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వెంటనే వేతనాలను రూ.11,500కు పెంచాం. అలాగే పదోన్నతి వయసును కూడా పెంచాం. ఈ సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. అర్హతను బట్టి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. కానీ అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదు.’’ అని మంత్రి ఉష శ్రీ చరణ్ అంగన్వాడీలకు క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed