- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చవద్దు: ఆదివాసీలు
దిశ. బుట్టాయగూడెం: బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు బుట్టాయగూడెంలో ఆందోళనకు దిగారు. గ్రామ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బుట్టాయగూడెం మండలంలోని పలు సచివాలయం కార్యదర్శులకు వినతిపత్రం అందజేశారు. బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చితే తమకు మనుగడ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లుకు విఘాతం కలుగుతుందని వాపోయారు. ఇప్పుడిప్పుడే రాజకీయం, సామాజికం, ఆర్థికం, విద్య, వైద్యం పట్ల ఆదివాసీలు ఆసక్తి చూపుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఇతర కులాలను ఎస్టీల్లో చేర్చితే మళ్ళీ తాము అడవులబాట పట్టాల్సివస్తుందేమోనని భయాందోళన వ్యక్తం చేశారు.
‘ఇప్పటికే జి.ఓ నెం.3ను సవరించి మాకు అన్యాయం చేశారు. ఆదివాసీ భూములకు రక్షణగా ఉన్న1/70 చట్టాన్ని సవరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆదివాసీల చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుతాలు, అధికారులు నడువవద్దు. బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలి. ఆదివాసీలకు న్యాయం చేయాలి.’ అని ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.