- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉమ్మడి పార్టీలో అభ్యర్థి ప్రకటన పై సర్వత్రా ఉత్కంఠ.. పోలవరం ఎవరికి ? వరం..!
దిశ, కుక్కునూరు: పోలవరం పేరు వినగానే జాతీయ ప్రాజెక్టు ఉన్న నియోజకవర్గమని ప్రతిఒక్కరికీ ఫండమెంటల్ గుర్తు. ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు (జాతీయ ప్రాజెక్టు)ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన దీనిపై దృష్టి పెడతారు. ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. పోలవరం నియోజకవర్గంలో రానున్న సాధారణ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి బరిలో ఉండగా, టీడీపీ - జనసేన కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడంతో, ఆ పార్టీ క్యాడర్ లో నిరుత్సాహం, అయోమయం నెలకొంది.
ఇంతకు టికెట్ సైకిల్ పార్టీ అభ్యర్థికా లేక జనసేన పార్టీకా అంటూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఏ ఇద్దరు కలిసిన ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఓ పక్క వైసీపీ అభ్యర్థి (సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి) పరిచయం పేరుతో నియోజకవర్గం మొత్తం చుట్టగా, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. వీరి వ్యూహం ఎవరికీ అంతుపట్టడం లేదు. పార్టీ ఆలోచనా ధోరణి ఎలా ఉన్నా రేపు జరగబోయే ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో సైకిల్ గుర్తు పోటీల్లో ఉంటేనే విజయం తథ్యమని, అలా కాకుండా జనసేనకు టికెట్ ప్రకటిస్తే వైసీపీ అభ్యర్థిని మనమే గెలిపించిన్నట్లు అవుతుందని, ఇరు పార్టీల కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు. టీడీపీ జనసేన కూటమి నుంచి ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు అవుతుందోనని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Read More..