- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pawan Kalyan: శెట్టిబలిజను గౌడ కులస్తులుగా గుర్తించాలి.. భీమవరంలో ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: బీసీలకు రాజ్యాధికారం రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. భీమవరంలో శెట్టిబలిజ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ శెట్టిబలిజను గౌడ కులస్తులుగా గుర్తించాలన్నారు. బీసీలంతా ఐక్కంగా ఉండాలని చెప్పారు. బీసీ సంక్షేమానికి జనసేన కట్టుబడి ఉందని పవన్ హామీ ఇచ్చారు. బీసీలు బలపడితేనే రాజ్యాధికారం వస్తుందని పవన్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఈత వనాలు ఏర్పాటు చేసి కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో కూడా అలా జరిగితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం దేశంలో ఎక్కడా సాధ్యంకాలేదని గుర్తు చేశారు. అలా జరిగితే బ్లాక్ మార్కెట్ పెరుగుతుందని తెలిపారు. ఛీప్ లిక్కర్ వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతారన్నారు. మద్యం అమ్మకాల్లో గౌడ కులస్తులకు వాటా ఇవ్వాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.