- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ వర్సెస్ జనసేన.. భీమవరంలో సోషల్ మీడియా ఫైట్
దిశ, డైనమిక్ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ,జనసేనల మధ్య వార్ కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు ఇరు పార్టీల మధ్య పోస్టర్ల వివాదం నడిచింది. తాజాగా సోషల్ మీడియా వివాదం తెరపైకి వచ్చింది. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్త బండారు మణికంఠ పోస్ట్ పెట్టాడని వైసీపీ ఆరోపించింది. ఈ మేరకు బండారు మణికంఠ పై పోలీసులకు వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో వీరవాసం పోలీసులు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చిన్న బాబు) జనసేన నాయకులు వీరవాసం పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. అటు వైసీపీ శ్రేణులు సైతం భారీగా తరలివచ్చారు. దీంతో వీరవాసం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జనసేన, వైసీపీ నాయకుల మధ్య పోలీస్ స్టేషన్లోనే తోపులాట జరిగింది. ఒకానొక సమయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట కూడా జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.