- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దశాబ్ధాల నాటి కలకు నిర్మలమ్మ అభయం
దిశ, ఏలూరు: ఇటీవల కాలంలో తీర ప్రాంతాలు సముద్రపు కెరటాల ధాటికి కోతకు గురవుతూవస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఇటువంటి ప్రాంతాలు అధికం. 1986లో కృష్ణాజిల్లా చిన్న గొల్లపాలెం సముద్రపు కోతకు గురై చాలా భూభాగం సముద్రంలో కలిసిపోయింది. దాన్ని అరికట్టేందుకు చేసిన యత్నాలు విఫలమవడంతో గ్రామస్తులు భయాందోళనల్లో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాని లంకకు వచ్చింది. డివిజన్ కేంద్రం నరసాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో చినమైనవాని లంక, పెదమైనవాని లంక గ్రామాలున్నాయి. చినమైనవాని లంకలో 3 వేల జనాభా ఉంటే పెదమైనవాని లంకలో కూడా ఇదే సంఖ్యలో జనాభా ఉన్నారు.
నిర్మలమ్మ రూపంలో అదృష్టం
గత మూడు దశాబ్దాలుగా ఈ రెండు గ్రామాలు సముద్రపు కోతకు గురవుతున్నాయి. చినమైనవాని లంక పూర్తిగా సముద్రం కోతకు గురికాగా, పెదమైనవాని లంక కూడా కడలిలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఈ రెండు గ్రామాలను, తూర్పుతాళ్ళు గ్రామంతో కలిపి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2015లో దత్తతకు తీసుకుని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అదే సంవత్సరం ఆమె ఈ గ్రామాల్లో పర్యటించారు. నిర్మలా సీతారామన్ అత్తవారిల్లు నరసాపురం కావడంతో ఈ గ్రామాలు దత్తత తీసుకుని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సముద్రం కోతకు గ్రామం గురవుతోందని పెదమైనవాని లంక గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆమె పెదమైనవాని లంక గ్రామాన్ని సముద్రపు కోత నుంచి రక్షించేందుకు ఆమె ఆలోచన చేసి గోడ కట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు యాంటీ ఎరోజన్ కట్ట గోడ నిర్మాణానికి ప్రతిపాదించడంతో ఆ గ్రామస్తుల దశాబ్ధాల నాటి కల నెరవేరినట్లవుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
19న టెండర్లు ..
పెదమైనవానిలంక గ్రామస్తుల అభ్యర్థన మేరకు నర్సాపురం మండల సర్వేయర్ సర్వే నిర్వహించి అలైన్‌మెంట్‌ను గుర్తించారు. కిలో మీటర్ ప్రాంతానికి తీరప్రాంత రక్షణ చర్యలను అందించడం కోసం డెలాయిట్ ఇండియా ఆధ్వర్యంలో కోత నిరోధక కట్ట నిర్మాణానికి ప్రతిపాదించి జూన్ నెలలో టెండర్లను పిలిచారు. డెలాయిట్ ఇండియా తన సి.ఎస్.ఆర్ నిధి నుంచి ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ నిర్మాణానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, మెంబర్లుగా జల వనరుల శాఖ ఏలూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, నరసాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి, డెలాయిట్ ఇండియా ప్రతినిధి, చెన్నై ఐఐటి నుండి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా భీమవరం డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు. పెదమైనవానిలంక గ్రామం వద్ద కోత నిరోధక కట్ట నిర్మాణానికి టెండర్లను 19న తెరవనున్నామని జిల్లా కలెక్టర్ , స్టీరింగ్ కమిటీ చైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు.