Weather: చలికి తెలుగు రాష్ట్రాలు గజగజ.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

by Shiva |   ( Updated:2024-11-19 04:03:29.0  )
Weather: చలికి తెలుగు రాష్ట్రాలు గజగజ.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో నిన్నటి నుంచి చలి తీవ్రత ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగింది. శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో స్కూళ్లు (Schools), ఆఫీసుల (Offices)కు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వృద్ధులు చలికి తట్టుకోలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా (Alluri Seetharamaraju District) పాడేరు (Paderu) ఏజెన్సీలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఈ సీజన్‌లోనే తొలిసారిగా ముంచింగిపుట్టు (Munchingipattu) వద్ద 9 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు (Paderu) 12, మినుములూరు (Minumuluru) ప్రాంతాల్లో 10 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పాడేరు (Paderu) మండల పరిధిలోని వంజంగి (Vanjangi) వద్ద మేఘాల మాటున ఉన్న సూర్యుడిని తిలకించేందుకు పర్యటకులు కొండపైకి భారీగా చేరుకుంటున్నారు.

Advertisement

Next Story