- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
దిశ, వెబ్ డెస్క్: ఏపీకి వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపారు.పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడనం బలహీనపడుతోందని, తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేస్తున్నామని, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మూడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సముద్రంలో అలలు ఎగిసిపడతాయని, మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు, పశువులకాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.