- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను.. తిరిగి నిలబెడతాం! చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: 78 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్ళలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను తప్పకుండా తిరిగి తీసుకువస్తామని అన్నారు. గత ఐదేళ్ళలో ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి ఇస్తామని, ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. అయితే రాష్ట్రంలో మొదట 100 రోజుల ప్రణాళికే లక్ష్యంగా అన్నిశాఖల్లో సమీక్షలు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని శాఖల్ని పునరుద్ధరిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే చైతన్యం కలిగిన ప్రాంతమని, 1857 కంటే ముందు బ్రిటీష్ దుర్మార్గపు పాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్ర మనకు చెబుతోందని వెల్లడించారు.విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన మొదలుపెట్టామని, అలాంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించామని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.