అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే అరెస్ట్‌ చేస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

by Mahesh |
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే అరెస్ట్‌ చేస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాదెండ్ల మనోహర్ అక్రమార్కులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రోజుకో ప్రాంతంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పర్యటిస్తున్న ఆయన గత ప్రభుత్వ నాయకులు, అధికారులు చేసిన అక్రమాలను వెలికి తీస్తూ.. చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గత ఐదేండ్లలో లక్షల టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు గురైందని నిర్ధారించిన మంత్రి వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఇదే విషయంపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై ఎవరైన అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే అరెస్ట్‌ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే గతంలో రేషన్ బియ్యం తరలించిన వారికి త్వరలో 41ఏ నోటీసులు ఇస్తామని.. ఇప్పటికే 6ఏ కింద నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేశామని గుర్తు చేశారు. దీంతో పాటుగా అక్రమంగా రేషన్ బియ్యం తరలింపును అరికట్టేందుకు చెక్‌పోస్ట్ దగ్గర అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని.. అవసరమైతే కీలక ప్రాంతాల్లో మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed