మేం జోక్యం చేసుకోలేం: అంగళ్లు కేసులో జగన్ సర్కార్‌కి చుక్కెదురు

by Seetharam |
మేం జోక్యం చేసుకోలేం: అంగళ్లు కేసులో జగన్ సర్కార్‌కి చుక్కెదురు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుంగనూరు, అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై మంగళవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి స్పష్టం చేసింది. ఈ అంగళ్లు ఘటనలో పోలీసు అధికారులు గాయపడ్డారని.. ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు దారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇకపోతే పుంగనూరు, అంగళ్లు కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేతలు పులివర్తి నాని, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలతోపాటు మెుత్తం 79 మందికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed