- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమెరికాలో గన్ కల్చర్.. ఇక్కడ గుంటూరు కారమే కల్చర్.. వైసీపీ ఎంపీ అభ్యర్థి
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల కోడ్ అమలు కావడం, ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అటు అధికార పార్టీకి ఇటు విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. తాజగా టీడీపీ నేతకు, వైసీపీ నేతకు మధ్య మాటలు తూటాల్లా పేలాయి. వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు, టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు మధ్య మాటల యుద్ధం నెలకొంది.
డబ్బుల మూటని ఆధారంగా చేసుకుని గుంటూరు అభ్యర్థిని టీడీపీ ప్రకటించిందని.. అలానే తాను ఎవరికీ భయపడనని వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే తుపాకీతో కాలుస్తాను అని అంటరాని.. తుపాకీ కల్చర్ అమెరికాలో ఉండొచ్చు.. కానీ గుంటూరులో ఉండేది గుంటూరు మిర్చి కారమని పెమ్మసాని చంద్రశేఖర్ ను ఎద్దేవ చేశారు. అలానే కిలారి రోశయ్య అంటే ఏంటో ఇక్కడ అందరికి తెలుసని పేర్కొన్నారు.
700 ఎకరాలు ఇన్టూ మూడు కోట్లు అంటే మొత్తం రెండు వేల ఒక వంద కోట్ల రూపాయల డబ్బు ఎక్కడికి పోయిందో ప్రజలు ఆలోచించాలి అంటూ పరోక్షంగా కిలారి రోశయ్య పై పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపణలు చేశారు. ఇక ఆ రెండు వేల ఒక్క వంద కోట్లు ప్రజల కోసం వినియోగించి ఉంటె కనీసం రోడ్లు అయినా శుభ్రంగా ఉండేవి అని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అన్నీ మట్టి రోడ్లుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు.
కాగా చంద్రశేఖర్ వ్యాఖ్యలపై కిలారి రోశయ్య కౌటర్ ఇచ్చారు. గ్రావెల్ మైనింగ్ గురించి చంద్రశేఖర్ మాట్లాడారని.. అయితే నిజానికి ఆయన పక్కన ఉన్న ధూళిపాళ నరేంద్ర స్క్రిప్ట్ రాసిస్తే చంద్రశేఖర్ చదివారని రోశయ్య ఎద్దేవ చేశారు. ఇక గ్రావెల్ మైనింగ్ లో 650 ఎకరాలను ఎవరు మైనింగ్ చేశారని అడిగితే ధూళిపాళ నరేంద్ర చేశారని చిన్నపిల్లాడు సైతం చెప్తారని.. ఒక సారి కనుకోవాల్సిందిగా NRI ని కోరుతున్న అని రోశయ్య అన్నారు.
ఇక మైనింగ్ కారణంగా ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న పంటలు కూడా పాడవుతున్నాయని.. భూగర్భ జలాలు కూడా అంతరించిపోయే అవకాశం ఉందని చంద్రశేఖర్ ఆరోపించగా.. టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య చెప్పిన అబద్దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం అని రోశయ్య ఎద్దేవ చేశారు. ఇలా ఇరు నేతల మధ్య మాటల యుద్ధం విరామం లేకుండా సాగుతోంది.