- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VYOOHAM : ‘వ్యూహం’లో వైఎస్ జగన్, భారతి పాత్ర ఉంది.. వివేకా మర్డర్‌ను చూపిస్తా: RGV
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ మరణం దగ్గర నుంచి వ్యూహం కధాంశం సాగుతుంది అని వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ అన్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా ఎన్నికల కంటే ముందే రిలీజ్ చేస్తామని తెలిపారు. వ్యూహం సినిమాకు సంబంధించి ప్రకాశం బ్యారేజీ వద్ద సినిమా షూటింగ్‌ను వర్మ ప్రారంభించారు. ప్రాజెక్టుల గురించి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు లు పిలిచి అడిగినా దర్శకత్వం చేయను అని చెప్పుకొచ్చారు. వైఎస్ మరణం తరువాత జరిగిన పరిణామాలు, ఎవరి వ్యూహాలు ఎలా వేశారో ఈ సినిమాలో తెలియజేస్తామన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉందని...వివేకానంద హత్యకేసులో నిందితులను ఈ సినిమాలో చూపిస్తానని చెప్పుకొచ్చారు. మరోవైపు వైఎస్ భారతిని తాను దగ్గర నుంచి చూశానని చెప్పుకొచ్చారు. వ్యూహం సినిమాలో వైఎస్ జగన్,వైఎస్ భారతిల పాత్ర కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎవరేమి సినిమాలు తీసినా తనకు అనవసరం అన్న ఆర్జీవీ తన పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
నావెనుక ఎవరూ లేరు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. వ్యూహం సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ఘట్టాలు ఇందులో ఉంటాయి అని చెప్పుకొచ్చారు. తాను వైఎస్ జగన్‌కు అభిమానిని అని చెప్పుకొచ్చారు. కానీ ఎవరిపైనా తనకు ద్వేషం లేదన్నారు. ఇచ్చే వాళ్లు ఉంటే... హీరోలు రెమ్యూనేషన్ తీసుకోవడంలో తప్పు లేదు అని చెప్పుకొచ్చారు. ఎవరికి ఎంత అనేది మార్కెట్‌ను బట్టి నిర్మాత చూసుకుంటారు అని చెప్పుకొచ్చారు. వ్యూహం సినిమా వెనుక దాసరి కిరణ్ తప్ప ఎవరూ లేరు అని వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ వెల్లడించారు.