- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాలంటీర్లకు భారీ ఊరట.. ఇకపై ఎవరి ఉద్యోగం పోదు..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పని చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలను డైరెక్ట్‌గా ప్రజలకే చేరవేస్తున్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ను నియమించి సేవలు అందిస్తున్నారు. కరోనా సమయంలో ఎవరూ చేయలేని సహాసాన్ని చేశారు. దీంతో వాలంటీర్లపై అన్ని వర్గాల ప్రజలనుంచి మంచి ఆదరణ లభించింది. ఏ ప్రభుత్వం వచ్చినా వాలంటీర్లను కొనసాగించాలనే డిమాండ్ వినిపించింది. అయితే కొన్ని చోట్ల జరిగిన ఘటనలతో వాలంటీర్లపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వాలంటీర్లపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసివేస్తామని ఆవేశంగా మాట్లాడారు. కొన్ని చోట్ల వాలంటీర్లు చేసిన చెడు పనులపై టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాలంటీర్లు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను తీసివేస్తామని హెచ్చరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ప్రజల నుంచి కూడా ప్రతిపక్ష నాయకులపై వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు వాలంటీర్లను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బెదిరించిన ఆడియో వైరల్ అయింది.
దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారు. అనంతపురం జిల్లా కదిలి రా సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసివేయమని చెప్పారు. ఎప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. అంతేకాదు వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, జీతాల విషయంలో వారికి న్యాయం చేస్తామని ఊరట కల్పించారు. అయితే వైసీపీ కోసం వాలంటీర్లు పని చేయొద్దని సూచించారు.