'విశాఖయే పరిపాలన రాజధాని'

by srinivas |   ( Updated:2022-12-24 14:35:19.0  )
విశాఖయే పరిపాలన రాజధాని
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయని, ఇక ఎన్ని చేసినా జవసత్వాలు రావని,.. లేవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ఎన్ని చేసినా ముఖ్యమంత్రి కాలేరని, మళ్ళీ గెలిచే సత్తా వైసీపీకి మాత్రమే ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేతే చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. విజయనగరం జిల్లాలో చంద్రబాబు మూడు రోజులుగా అబూత కల్పనలు, అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఈ పర్యటనలో చంద్రబాబు హయాంలో ఈ జిల్లాకు ఏం చేశారో చెప్తే బాగుండని అన్నారు. రాజాం, బొబ్బిలి రెండు సభల్లో ఒక్క మాట కూడా నిజం చెప్పలేదు. చంద్రబాబు గానీ అశోక్ గజపతి రాజు గానీ ఈ జిల్లాకు ఏమి చేశారో చెపితే బాగుణ్ణు అని మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. వ్యవసాయం మీద చంద్రబాబు చెప్పిన మాటలు అన్ని అబద్దాలేనని చెప్పారు. రైతులును నిండా ముంచింది చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయం మొత్తం సర్వనాశనమైపోయిందన్నారు. వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వంలోనే వ్యవసాయం అభివృద్ధి చెందిందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వ్యవసాయంలో రైతులకి ఎలాంటి నష్టం జరగకుండా వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అని చెప్పుకొచ్చారు. మా ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. బొబ్బిలి షుగర్ పరిశ్రమని ప్రయివేట్ వ్యక్తులకు అమ్మింది చంద్రబాబు కాదా అని మంత్రి నిలదీశారు. మరోవైపు విశాఖకు రాజధాని తరలి రావడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed