Visakha: సివిల్ తగాదాల్లో అనకాపల్లి ఇంచార్జ్ డీఎస్పీ

by srinivas |   ( Updated:2023-04-14 13:25:10.0  )
Visakha: సివిల్ తగాదాల్లో అనకాపల్లి ఇంచార్జ్ డీఎస్పీ
X

దిశ, అనకాపల్లి: సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలుకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆక్షేపించిన కొందరు పోలీసు అధికారుల తీరు మారడం లేదు. తాజాగా అనకాపల్లి మండలం 84వ వార్డు పరిధిలో కొండకొప్పాకలో వివాదాస్పదమైన ఇంటి విషయంలో అనకాపల్లి ఇంచార్జి డీఎస్పీ మల్ల మహేష్ ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటిలోకి చొరబడి తమపై పరుష పదజాలంతో మాట్లాడుతూ నువ్వు ఉంటున్న ఇల్లుని ఖాళీ చేయకుంటే జైలుకు పంపిస్తాను అంటూ డీఎస్పీ తనపై దురుసుగా వ్యవహరించారని బాధిత మహిళ మాధవి ఆరోపించారు.

ప్రభుత్వం తమ తల్లి సత్యవతికి ఇచ్చిన మూడు సెంట్లు స్థలంలో ఇల్లును నిర్మించుకోవడం జరిగిందని కూతురు మాధవి చెప్పారు. తాను పొట్టకూటి కోసం పొరుగు దేశాలకు జీవనం కోసం వెళ్లగా ఇదే అదునుగా తన సోదరుడు నీరుకొండ సాయి రామకృష్ణ, సుంకర నాగమణికి రూ.15 లక్షలకు విక్రయించాడని బాధితురాలు తెలిపారు. పట్టాదారుడిని సత్యవతి సంతకాలు లేకుండానే ఇంటిని విక్రయించడం జరిగిందని అన్నారు. ఏడాది క్రితం నుంచి ఇంటి విషయమై మండ మరియమ్మ, ఎలుగుబంటి మాధవి, సుంకర నాగమణిల మధ్య వివాదం నడుస్తుందని అన్నారు. ఈ విషయంపై ఎస్పీ కార్యాలయం ఫిర్యాదు చేయడం జరిగిందని విచారణ చేపట్టిన అప్పటి డీఎస్పీ సునీల్ తనకు న్యాయం చేశారని అన్నారు. ఇదే విషయంపై ఇంచార్జి డీఎస్పీ మహేష్ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని పరుష పదజాలంతో మాట్లాడడమే కాకుండా తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు మాధవి ఆవేదనను వెలిబుచ్చారు.

Also Read..

జీతాలు పెంచండి మహాప్రభో.. అంబేద్కర్ విగ్రహానికి వీఆర్ఏల మెుర

Advertisement

Next Story

Most Viewed