Hormone Injections Case: ఇద్దరు పాస్టర్లపై తల్లి సంచలన ఆరోపణలు

by srinivas |
Hormone Injections Case: ఇద్దరు పాస్టర్లపై తల్లి సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కూతురిని హీరోయిన్‌ను చేసేందుకు ఓ తల్లి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చిందనే కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో తన తప్పు ఏమీ లేదని తల్లి ఆనందకుమారి వెల్లడించారు.. అభిషేక్, దేవరాజ్ అనే ఇద్దరు పాస్టర్లు తన కూతుర్ని రెచ్చగొట్టి.. తనపై తప్పుడు కేసు పెట్టించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తెను లొంగదీసుకోవాలని ఆ ఇద్దరూ ప్లాన్ చేశారని అందుకు తాను ఎక్కడ అడ్డుతగులుతాననే భయంతో ఇలా అసత్య ఆరోపణలు చేశారని ఆరోపించారు. తన కుమార్తె కూడా ఆ పాస్టర్ల ట్రాప్‌లో పడిందని చెప్పుకొచ్చారు. తమ కుటుంబానికి సాయం చేస్తున్నట్లు నటించి.... తన కూతురుని వాడుకోవాలని చూశారని ధ్వజమెత్తారు. అందుకు తాను తన కుమార్తె ఒప్పుకోకపోవడంతో వారు కుట్ర పన్నారని, అందులో భాగంగానే తన కూతురుని పిచ్చిదాన్ని చేశారని ఆనందకుమారి ఆరోపించారు. తన కుమార్తెను బాగు చేస్తున్నట్లు నటించి శారీరకంగా...మానసికంగా హింసించారని ఆరోపించారు.

ఈ అంశంపై గతంలోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. తాను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలని ఆ పాస్టర్లు తన కూతురితో చైల్డ్ లైన్ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయించారని వాపోయారు. తన కుమార్తెను హీరోయిన్‌ను చేయాలనే ఆలోచన తనకు లేదని.. అందుకోసం ఎలాంటి హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వలేదని ఆనందకుమారి తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక విశాఖపట్నంలోని స్వధార్ హోమ్‌లో ఉంటుంది. ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. ఇలాంటి తరుణంలో తన కూతురికి తాను ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వలేదని, దీనికి వెనుక ఇద్దరు పాస్టర్లు కుట్ర ఉందని బాలిక తల్లి చెప్పడం సంచలనంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed