బాబాయిని చంపింది అబ్బాయేనా..? వివేకా హత్య కేసు చిక్కుముడి వీడినట్లేనా?

by Indraja |   ( Updated:2024-03-06 08:42:25.0  )
బాబాయిని చంపింది అబ్బాయేనా..? వివేకా హత్య కేసు చిక్కుముడి వీడినట్లేనా?
X

దిశ డైనమిక్ బ్యూరో: వైఎస్ వివేకానంద రెడ్డి 2019లో ఎన్నికలకు ఇక ఒక నెల సమయం ఉండగా మరణించారు. మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వినిపించినప్పటికీ ఆ తరువాత గొడ్డలితో నరకడం కారణంగా మృతి చెందారు అనే వార్త వెలుగు చూసిన విషయం అందరికి తెలిసిందే. అయితే వివేకా హత్య జరిగి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా కేసు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు.

2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి అన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివేకా హత్యా కేసులో సీబీఐని ఆశ్రయించారు. తన బాబాయ్ ని ప్రతిపక్ష పార్టీలు కుట్రతో హత్యా చేశాయని తీవ్రంగా ఆరోపించారు. వివేకా హత్యా కేసులో సీబీఐ స్పందించాలని.. హత్య గురించి విచారణ జరపాలని తీవ్ర పోరాటం చేశారు.

ఇంతలో 2019 లో ఎన్నికలు జరగడం.. ఆ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఎన్నికలకు ముందు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యా కేసులో సీబీఐ విచారణ జరగకుండా అప్పటి అధికార పార్టీ టీడీపీ అడ్డుపడుతోందని తీవ్రంగా ఆరోపించిన సీఎం జగన్ తాను అధికారంలోకి వచ్చాక మాత్రం వివేకా హత్య కేసు గురించి పట్టించుకోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇక అధికారం తన చేతుల్లో ఉన్నా.. వివేకా హత్యా కేసు విషయంలో జోక్యం చేసుకోకపోగా.. అంతకముందు ఇచ్చిన పిటీషన్ ను కూడా వెనక్కి తీసుకున్నారు. దీనితో వివేకా హత్యకేసుకు జగన్ కు సంబంధం ఉందనే అనుమానాలు రేకెత్తాయి. ఇక ఆ అనుమానాలకు అర్జ్యం పోసినట్టు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ఇటీవల మాట్లాడుతూ తన అన్న జగన్ ను ప్రశ్నించింది.

వివేకా మరణించిన తరువాత ఎవరికీ తెలియకముందే గొడ్డలితో నరకడం కారణంగానే మా నాన్న చనిపోయారని మీకు ఎలా తెలిసింది అని ప్రశ్నించారు. అలానే సీబీఐ కి ఇచ్చిన పిటీషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు అని అడిగారు. అయితే సునీత అడిగిన ఏ ప్రశ్నకు జగన్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. ఇక వివేకా హత్య కేసులో అప్రూవుడుగా మారిన దస్తగిరి కూడా వివేకా హత్య వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని తేల్చి చెప్పారు.

అయితే వివేకా కేసులో నిజానిజాలను అధికారికంగా ఏ కోర్టు ప్రకటించలేదు. మరి ముందుముందు అయినా వివేకా హత్యా కేసు ఓ కొలిక్కి వస్తుందేమో చూడాలి.

Read More..

విశాఖపై వైసీపీ విజన్ ఇదే.. షర్మిల సెటైరికల్ ట్వీట్

Advertisement

Next Story

Most Viewed