- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Saubhagyamma: వివేకా హత్య నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు.. !
దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేయొద్దని వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సునీల్ యాదవ్‌కు కడప జిల్లా కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి.
విచారణ ఈనెల 27కు వాయిదా
అనంతరం సుప్రీంకోర్టు వైఎస్ వివేకా హత్య కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో సునీల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సునీల్ యాదవ్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హత్య కేసులో ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
Also Read...