Anakapalli: పేదరికం తగ్గింది.. జగన్ రుణం తీర్చుకుందాం..!

by srinivas |
Anakapalli: పేదరికం తగ్గింది.. జగన్ రుణం తీర్చుకుందాం..!
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో 12 శాతం ఉన్న పేదరికం జగన్ పాలనలో 5 శాతానికి తగ్గిందని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శనివారం అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టింది. సబ్బవరం జంక్షన్‌లో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. సామాజిక సాధికార యాత్ర ప్రతిపక్షాలకు కలవరం కలిగిస్తోందన్నారు. దేశానికి దిక్సూచిగా ఈ యాత్ర సాగుతోందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజునే జగన్ పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారని గుర్తు చేశారు. పేదరికం విద్య, వైద్యం, వ్వవసాయం, సంక్షేమానికి అనర్హత కారదని జగన్ ఆనాడే సంకల్పించారన్నారు. ఎన్నాళ్లుగానో అణగదొక్కిన కులాలను జగన్ ఉద్దరించే సాహసానికి పూనుకున్నారన్నారు.

ప్రతీ ఏడాది 36 బటన్లు నొక్కి అవినీతి లేకుండా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారని చెప్పారు. అందుకు ప్రతిగా వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి జగన్ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ పాలనా రాజధానిగా సీఎం జగన్ ప్రకటించిన త్వరాత ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక సాధికారతేనన్నారు. మామను చంద్రబాబు వెన్నుపోటు పోడిచి అధికారంలోకి వచ్చినట్లే, రైతులను, మహిళలను మోసం చేశాడని, సీఎం జగన్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణాలు మాఫీ చేశారని, అవ్వా తాతలకు పెన్షన్ విడతల వారీగా పెంచుతూ వస్తున్నారని గుర్తు చేశారు.

నెరవేరిన హామీలు : పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు

పాదయాత్ర సమయంలో రాష్ర్టంతో పాటు నియోజకవర్గంలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు అన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, డ్వాక్రా రుణాలు మాఫీ చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. రూ.2 వేల కోట్లకు పైగా నిధులు లబ్ధిదారుల అకౌంట్లలో వేసి అందరి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించారన్నారు. ఏ పథకం కోసమైనా ప్రజలు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ల ద్వారా నేరుగా అర్హులను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలకు వర్తింపజేస్తున్నారన్నారు. ఐదేళ్లు సీఎంగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే అనేక సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు అమలు చేసిన ఒక్క పథకం పేరైనా సరే గుర్తుకు వస్తుందా ? ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed