- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mlc Kalyani: నారీలోకం నమ్మదు బాబూ..!
దిశ, డైనమిక్ బ్యూరో: మహా శక్తి పేరిట.. మాయాశక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళా ద్రోహి చంద్రబాబు బిల్డప్‌లు ఇస్తున్నాడని, మోసకారి బాబును నారీలోకం నమ్మే పరిస్థితుల్లో లేదని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మహిళా పుట్టుకను అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడని మండిపడ్డారు. ప్రపంచ సైకోలకు గౌరవ అధ్యక్షుడు ఎవరంటే చంద్రబాబేనని ఎవరినడిగినా టక్కున చెబుతారన్నారని విమర్శించారు. విశాఖలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పాలన ద్వారా లబ్ధిపొందిన ప్రజలంతా సీఎం జగన్ నీరాజనాలు పలుకుతున్నారని, మహిళల్లో జగనన్న ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరానికి ఎదుగుతుందని, దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్‌లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ట్రైనింగ్, పవన్ ప్రామ్టింగ్ ముగ్గురు కలిసికట్టుగా సీఎం జగన్‌ను టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీడీపీ హయాంలో మహిళలకు రక్షణే కల్పించలేదని వరుదు కల్యాణి అన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయకపోగా కాంప్రమైజ్‌కు ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ప్రపంచ సైకోలకు గౌరవ అధ్యక్షుడు బాబు అని విమర్శించారు. టీడీపీ గుర్తు సైకిల్ అయితే ఆ పార్టీ పాలన సైకో పాలన అని కల్యాణి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అంటే తెలుగు మహిళా ద్రోహుల పార్టీ అని అందరికీ తెలుసన్నారు. వలంటీర్లకు చంద్రబాబు, పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. జగనన్న పాలన చూసి చంద్రబాబు, పవన్ ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు.