- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బులిస్తేనే వెళ్తాం..జగనన్న పంపిన డబ్బు ఎక్కడ? ఆ పార్టీ అభ్యర్థుల ఇళ్ల వద్ద నిరసనలు
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: సోమవారం నాటి పోలింగ్‌కు డబ్బులిస్తేనే వెళ్లి ఓటు వేస్తామని పెద్ద సంఖ్యలో మహిళలు మంత్రి ఇంటిని, ఎంపీ కార్యలయాన్ని చుట్టుముట్టారు. గాజువాక అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్ర గుడివాడ అమర్నాధ్, విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లకు ఆదివారం వింత అనుభవం ఎదురైంది. జగనన్న పంపించిన డబ్బులు మాకు ఇంకా ఎందుకు ఇవ్వలేదని వారిని మహిళలు నిలదీశారు. డబ్బు ఇవ్వకపోతే కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. చివరకు ఏదో సమయానికి అందజేస్తామని బతిమాలి పంపిచాల్సి వచ్చింది.
అమర్ బూత్ కమిటీల వద్ద గొడవలే..
మంత్రి అమర్నాధ్ బూత్ కమిటీ సమావేశాల కోసం అక్కడికి వెళితే అక్కడ జనం తమకు ఓటు వేసేందుకు డబ్బు అందలేదని నిలదీయడం చికాకు తెప్పించింది.చిరాగ్గా సాయంత్రం ఇంటికి వచ్చిన ఆయనకు ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు డబ్బు కోసం వేచి వుండడం షాక్‌కి గురిచేసింది. పంపిణీ సరిగ్గా జరగకపోవడం వల్ల ఇలా అక్కడికి వెళితే అక్కడ జనం వెంటపడుతున్నారు. ఆయన నేతలు, కార్యకర్తల పై చిరాకు పడ్డారు. బూత్ ఏజెంట్ల సమావేశాల నిర్వహించిన ఆయనకు పలు చోట్ల డజన్ల సంఖ్యలో జనం వచ్చి తమకు ఓటు వేసేందుకు డబ్బు ఇవ్వలేదని, ఇప్పుడు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ ప్రాంతానికి చెందిన నేతల పేర్లు చెప్పి, వారితో వచ్చిన నేతలను తిట్టి అక్కడ నుంచి పంపించేశారు.
గాజువాకలో రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతపపూడి వెంకట్రామయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డిలు ఆయన వెంట మంత్రి అమర్ సోమవారం నాటి పోలింగ్ కసరత్తులో భాగంగా బూత్ ఏజెంట్ల సమావేశాలకు ఆదివారం వెళ్లారు. ప్రతి సమావేశంలో రెండు గ్రూపులు గొడవలకు దిగడంతో వారికి సర్ది చెప్పాల్సి వచ్చింది. తన ఎదుటే గొడవకు దిగుతున్న వీరు పోలింగ్ ఎలా నిర్వహిస్తారో అన్న అనుమానం వచ్చిన అమర్ ఒక దశలో అసహనంతో మీరే ఎన్నికల చేసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటి వద్ద మహిళలతో మరింత ఇరకాటం..
ఇంటి వద్ద డజన్ల సంఖ్యలో మహిళలు అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం తదితర ప్రాంతాల నుంచి డబ్బులు పంచలేదంటూ రావడం ఆయనకు మరింత చిరాకు తెప్పించింది. వారికి ఏం చెప్పాలో తెలియక మీడియాకు ఎక్కడ దొరుకుతానో అన్న భయంతో తాను అసలు డబ్బే పంచడం లేదంటూ లోపలికి వెళ్లిపోయారు. అయినా, మహిళలు అక్కడ నుంచి కదలకపోవడంతో కార్పోరేటర్లతో వారితో రాయబారం జరిపారు. ఎదో సమయంలో డబ్బు పంపుతామని సర్దిచెప్పి అతికష్టం మీద వారిని ఇంటి వద్ద నుంచి పంపించేశారు.
విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తున్న ఎంపీ ఎం వీ వీ సత్యనారాయణ కార్యాలయన్ని వందల సంఖ్యలో మహిళలు ఆదివారం రాత్రి ముట్టడించారు. లాసన్స్ బే పోస్ట్ ఆఫీస్ కు సమీపంలోని ఆయన కార్యాలయాన్ని డబ్బులు కావాలంటూ ఓటర్లు ముట్టడించారు. దీంతో లిఫ్ట్ ఆపేసి గేటుకు ఎంవీవీ సత్యనారాయణ తాళాలు వేసుకున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఎంవీపీ కాలనీ పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.