- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసీ ఆదేశాలు బేఖాతరు.. జగన్‌కు ఓటు వేయాలని ఇంటింటికి వాలంటీర్ల ప్రచారం
దిశ, వెబ్ డెస్క్: వాలంటీర్లకు ఎన్నికల విధులు నిర్వహించొద్దని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను యదేచ్ఛగా తుంగలో తొక్కారు. ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గొలుగొండ మండలంలో వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని కోరుతున్నారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎవరు ప్రచారం చేయమని నిలదీశారు. దీంతో జగన్ ను గెలిపించుకునేందుకు తామే ఓటు వేయాలని లబ్ధిదారులను కోరుతున్నామని వాలంటీర్లు సమాధానం చేప్పారు. దీంతో జిల్లా అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నిబంధనలను పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇప్పటికైనా ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకుండా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంటింటికి తిరుగుతూ జగన్‌కు ఓటు వేయాలని కోరుతున్న వాలంటీర్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారేమో చూడాలి.