- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: 280 మంది రౌడీ షీటర్లకు సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
దిశ,డైనమిక్ బ్యూరో: విశాఖపట్నంలో రౌడీషీటర్లపై పోలీసుల నిఘా పెంచినట్లు సీపీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ల్యాండ్ సెటిల్మెంట్‌లు, భూ కబ్జాలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. విశాఖ నగర పరిధిలో ఉన్న ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్‌హెచ్ ఓ స్థాయిలో కౌన్సిలింగ్ జరుగుతున్నప్పటికి రౌడీ షీటర్‌లలో ఎలాంటి మార్పు కనిపించని పరిస్థితి నెలకొందని దీంతో తానే రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు సీపీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నేరాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. విశాఖలో 280 మంది A కేటగిరీ రౌడీ షీటర్‌లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ప్రతి ఆదివారం రోజు రౌడీ షీటర్‌లకు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. బెయిల్‌పై బయటకి వచ్చిన వారు మళ్లీ నేరాలకి పాల్పడితే బెయిల్ క్యాన్సిల్ చేస్తామని సీపీ త్రివిక్రమ్ వర్మ వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి : Ap News: ప్రేమికుడికి ప్రేయసి తల్లి కండీషన్ .. ఒప్పుకోకపోడంతో దారుణం