Rushikonda Coast: హమ్మయ్యా.. ఊపిరి పీల్చుకున్నారు!

by srinivas |   ( Updated:2023-04-22 14:36:19.0  )
Rushikonda Coast: హమ్మయ్యా.. ఊపిరి పీల్చుకున్నారు!
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ రుషి కొండ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన యువకులు సముద్ర కెరటాల్లో చిక్కుకున్నారు. కెరటాల్లో చిక్కున్న ముగ్గురు యువకులను లైఫ్ గార్డ్స్ కాపాడారు. రాయపూర్‌కి చెందిన ప్రభాత్ అదిల్, సిద్దార్ద అదిల్, ఆశోక్ అదిల్ విశాఖలో బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే వీరు టూరిస్టు ప్రాంతాలను వీక్షించే క్రమంలో విశాఖ తీర ప్రాంతానికి వెళ్లారు. వేసవి కావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక సముద్రంలో స్నానానికి దిగారు. అయితే వీరిని బలమైన కెరటం లాక్కెళ్లడంతో అక్కడే ఉన్న మరికొందరు టూరిస్టులు లైఫ్ గార్డులను అప్రమత్తం చేశారు. లైఫ్ గార్డులు సముద్రంలోకి వెళ్లి నీటిలో కొట్టుకు పోతున్న ముగ్గురు యువకులను బయటకు తీసుకొచ్చారు. యువకులకు సపర్యలు చేసి రక్షించారు.

Advertisement

Next Story

Most Viewed