Visakha: ఏపీకి మరో దిగ్గజ వ్యాపారవేత్త గుడ్ బై.. త్వరలో తెలంగాణకు షిఫ్ట్!

by srinivas |   ( Updated:2023-06-21 15:51:28.0  )
Visakha: ఏపీకి మరో దిగ్గజ వ్యాపారవేత్త గుడ్ బై.. త్వరలో తెలంగాణకు షిఫ్ట్!
X

దిశ, వెబ్ డెస్ట్: ఏపీకి మరో దిగ్గజ వ్యాపారవేత్త గుడ్ బై చెప్పునున్నారు. విశాఖలో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆయన త్వరలో తెలంగాణకు ఫిష్ట్ అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. విశాఖలో తన ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారంతో మనస్థాపం చెందిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి విశాఖలో వ్యాపారం చేయదలుచుకోలేదని వెల్లడించారు. తమ వ్యాపారాలను హైదరాబాద్‌కు మారుస్తున్నామన్నారు. కేవలం రాజకీయాల్లోకి రావడం వలనే తన వ్యాపారాలను మీడియా టార్గెట్ చేస్తుందన్నారు. తన వల్ల ప్రభుత్వానికి గాని, పార్టీకి గాని చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో వ్యాపార వేదికను మారుస్తున్నామన్నారు. సిరిపురంలో సీబీఎన్సీ ల్యాండ్ విషయంలో సుప్రీంకోర్టులో విజయవాడకు చెందిన యజమానులు గెలుచుకొని కేవలం డెవలప్‌మెంట్‌కు తనకు అప్పగించారన్నారు. చిన్న చిన్న ఫిర్యాదులున్నా ఏ ఒక్కటి తప్పు చేసినట్లు రుజువు కాలేదని సత్యనారాయణ తెలిపారు. తన ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారంతో తనపైనే బురద జల్లుతున్నారని సత్యనారాయణ ఆవేదన వ్యక్త చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తన భార్యను 30 గంటలు, తన కుమారుడుని 50 గంటలపాటు కిడ్నాపైనప్పటికి చివరి నిమిషం వరకు తనకు సమాచారం లేదని స్పష్టం చేశారు. బయట ప్రపంచం తెలియని వారికి కిడ్నాపర్ నకరం చూపించాడని ఆయన తెలిపారు. చావు వరకు తీసుకెళ్లిన అగంతకుడి గురించి ఎవరూ మాట్లాడకపోగా, తనపై, తన కుటుంబంపై ఏవేవో మాట్లాడుతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుడు జీవీ సహితం చావు వరకు వెళ్లేంతగా కిడ్నాపర్ బాధించారన్నారు. తాను అందరిలాగే మనిషినేనని, సమాజంలో ఎంపీ అంటే అతీతమేం కాదన్నారు. ఒళ్లంతా దెబ్బలతో అడవిలో కారు దింపేసి వదిలి వెళ్లాడన్నారు. రెండు గంటలపాటు నడిచి ప్రధాన రహదారికి చేరుకున్నారన్నారు. ఇంత జరిగితే.. కిడ్నాప్‌లో ఇంకేమైనా కోణం ఉందా అంటూ మీడియాలో వస్తున్న కథనాలు చాలా బాధాకరమని ఎంవీవీ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

Read more: Kidnap Incident: పవన్ కల్యాణ్ చాలా బెటర్.. ఎంపీ సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed