Visakha: లేని పోని సాకులతో రైతులకు తీవ్ర అన్యాయం!

by srinivas |
Visakha: లేని పోని సాకులతో రైతులకు తీవ్ర అన్యాయం!
X

దిశ, ఉత్తరాంధ్ర: జగన్ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతోందని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం టీడీపీ నేత గండి బాబ్జీ అన్నారు. బాలాసోర్ రైలు దుర్ఘటన బాధాకరమని, తెలుగుదేశం పార్టీ తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. కవచ్ వ్యవస్ధ పని చేయకపోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం ఏపీలో ఏరువాక మొదలవుతోన్న సమయం‌లో కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పని ముట్లు ఇప్పటివరకు అందజేయకపోవటంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్బీకేల్లో భవనాలే పూర్తి చేయలేదని, పనిముట్లే లేవని విమర్శించారు. ‌ప్రతి రైతు 2,45,500 సగటు అప్పుల్లో కూరుకు పోయారని తెలిపారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని మండిపడ్డారు. 13,500 రైతు భరోసా కింద ఇస్తామన్నాని, 4 ఏళ్లలో ప్రతి రైతుకు 54 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


చంద్రబాబు హయాంలో రైతులకు ఏడాదికి 1 లక్షా 15 వేలు వచ్చేటట్లు చేశారని టీడీపీ నేత గండి బాబ్జీ గుర్తు చేశారు. నాలుగేళ్లలో 9 తుపానులు వచ్చాయని, 54 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం లేని పోని సాకులు చూపి రైతులకు అన్యాయం చేసిందదని మండపడ్డారు. పోలవరం 2022కి పూర్తి చేస్తామన్నారు ఏ మేరకు పని చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరాన్ని ఏటీఎమ్‌లా ఉపయోగించుకుని కేంద్రం నుంచి నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి 35 వేల కోట్లు రావాల్సి వుంటే 10 వేల కోట్లు ఇస్తే జగన్ ప్రభుత్వం సరిపెట్టుకొని చోద్యం చూస్తుందని గండి బాబ్జీ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed