- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ పాలనలో దాచుకోవడం,దోచుకోవడమే..పృథ్వీరాజ్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: జగన్ రెడ్డి పాలనలో దోచుకోవడమే,దాచుకోవడమే జరిగిందని, ప్రజలు దారుణంగా మోసపోయారని సినీ నటుడు పృథ్వీరాజ్ అవేదన వ్యక్తం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌తో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిపాలన చేతకాని జగన్ రెడ్డి కారణంగా 70 సంవత్సరాలు సక్రమంగా పని చేస్తున్న వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు.
నియోజకవర్గంలోని రెల్లి వీధి అంబేద్కర్ జంక్షన్, గొల్ల వీధి , భజన కోవెల , యాత వీధి ,బ్రహ్మంగారి వీధి ప్రాంతాల్లో ప్రచారం జరిపారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇక ఏమీ మిగలదు అన్నారు. పాటలు,మాటలతో ప్రచారంలో జోష్ నింపారు. యువకులు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని పాలన మారాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.