- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: బోటు ప్రమాద మత్య్సకారులకు పవన్ ఆర్థిక సాయం అందజేత
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించారు. ఫిషింగ్ హార్బర్‌లో బోటు దగ్ధంలో నష్టపోయిన మత్స్యకారులను ఆయన పరామర్శించారు. రూ. 50 వేల చొప్పున ఒక్కొక్కరికి సాయం చేశారు. అయితే ఆయన పర్యటన ఆలస్యంగా సాగింది. హైదరాబాద్ నుంచి రావాల్సిన ఫ్లైట్ రద్దు కావడంతో ఆయన విశాఖకు ఆలస్యంగా చేరుకున్నారు. మరో ఫ్లైట్ లో విశాఖకు చేరుకుని బోటు ప్రమాద బాధితులను పవన్ కల్యాణ్ పరామర్శించారు.
కాగా విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో నిలిపి ఉన్న ఓ బోటులో మంటలు చెలరేగి రెప్పపాటులో మిగిలిన బోట్లన్నింటికి వ్యాపించాయి. దీంతో 45కిపైగా బోట్లు కాలి బూడిదయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లింది. విశాఖకు చెందిన మత్స్యకారులకు చేపలవేటే జీవనాధారం. సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడమే వారికి తెలుసు. సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు బోట్లను ఉపయోగిస్తుంటారు. చాలా మంది మత్స్యకారులకు వేటాడటం వచ్చు కానీ సొంతంగా బోట్లు లేని పరిస్థితి. అలాంటి వారు బోట్లను అద్దెకు తీసుకువచ్చి వేటాడతారు. ఇలా పగటిపూట మత్స్యకారులంతా వేటకు వెళ్లి రాత్రిపూట బోట్లను ఫిషింగ్ హార్బర్‌లో పెట్టి సేద తీరుతారు. అలా బోట్లను పెట్టిన ఫిషింగ్ హార్బర్‌లోనే ప్రమాదం జరగడంతో గంటల వ్యవధిలో 45కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి.