ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా ''మీటర్'' : హీరో కిరణ్ అబ్బ వరం

by Prasanna |
ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా మీటర్ : హీరో కిరణ్ అబ్బ వరం
X

దిశ, ఉత్తరాంధ్ర : విశాఖ నగరంలోని వుడా పార్కు రోడ్డులో గల పార్క్ హోటల్ లో మీటర్ సినిమా చిత్ర యూనిట్ మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర హీరో కిరణ్ అబ్బ వరం మాట్లాడుతూ, ఇది పూర్తిగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా అన్నారు. ఈ సినిమా వెటకారం తో కూడిన వినోదాత్మక చిత్రం అన్నారు. తనను మొదటి చిత్రం నుంచి ఆదరిస్తున్న వైజాగ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. మన ఇంట్లో తం, కొడుకుల కథే మీటర్ అన్నారు. ఇది తాను నటించిన ఎడవ చిత్రం ఈనెల ఏడో తేదీ విడుదల అవుతుందన్నారు. విభిన్న పోలీస్ కథాంశం తో ఈ చిత్రం తీసా మన్నారు. మీ డ్రీమ్ రోల్ ఎంటని ప్రశ్నించగా శ్రీ మంతుడు వంటి పాత్ర చేయాలని వుండేదని వినారో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఆ కల నెరవేరింది అని పేర్కొన్నారు. ఈ సినిమా తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇందులో పోలీసు పాత్ర పూర్తిగా కొత్తదనంతో వుంటుంది అన్నారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అన్నారు.

చిత్ర దర్శకుడు రమేష్ కాడూరి మాట్లాడుతూ, ఇది తన తొలి చిత్రం అన్నారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం అన్నారు. తాను దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని వద్ద సహాయకునిగా పని చేశాను అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద సంస్థలో తొలి సినిమా అయినా సరే ఒత్తిడి అనిపించ లేదని, నిర్మాతలు పూర్తి స్వేచ్చ ఇచ్చారు అన్నారు. హీరోయిన్ అతుల్య రవి మాట్లాడుతూ, తెలుగులో ఇది తన తొలి సినిమా అన్నారు. ఇందుకోసమే తెలుగు నేర్చుకున్నాను అన్నారు. కిరణ్ వంటి హీరోతో నటించడం చాలా ఆనందంగా వుంది అన్నారు.

Advertisement

Next Story