విశాఖలో భారీ వర్షంతో కూలిన పాత భవనం..ఇద్దరికి తీవ్ర గాయాలు

by srinivas |
విశాఖలో భారీ వర్షంతో కూలిన పాత భవనం..ఇద్దరికి తీవ్ర గాయాలు
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వన్ టౌన్ ప్రాంతంలో పాత భవనం బాల్కనీ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో చిట్టిబొయిన నాగరాజు(50) , ప్రవీణ్ (25) వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయలైన వారిని 108‌లో చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నాగరాజు కుడికాలు వేలు తెగిపడగా, ఆయన కుమారుడు ప్రవీష్ 5 కాలు విరిగింది. ప్రమాద సమయంలో భవనంలోనే ఉన్న కుటుంబ సభ్యులు ఉండిపోయారు. బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. దాంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. భవనం నుంచి చిన్నబాబుతో సహా ఐదుగురిని సురక్షితంగా బయటికి తీశారు.

తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని జీవీఎంసీ

ఇటీవల విశాఖ కలక్టరేట్ సమీపంలో ఇల్లు కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. నగరంలో 327 ఇళ్లు కూలిపోయే దశలో ఉన్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఆయా ఇళ్లను తక్షణమే పడగొట్టకపోతే ఇలాంటి ప్రమాదాలు తప్పవు. ఎవరి ఇల్లు వాళ్లే కూల్చుకోవాలనే నిబంధనతో మరోవైపు కొన్ని ఇళ్ల యజమానులు వేరే ప్రాంతాల్లో ఉండడంతో పాతబడ్డ ఇల్లు కూల్చివేతలు జరగడంలేదు. కాలంచెల్లిన నిర్మాణాల కూల్చివేతలపై జీవీఎంసీ యే చొరవ చూపాలని, ముఖ్యంగా వన్ టౌన్‌లో పురాతన భవనాలను తక్షణమే కూల్చకపోతే ముప్పు తప్పదని విశాఖ నగర వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed